తక్కువగా వర్తకం జరిపిన భారతీయ మార్కెట్లు, 1.81% క్షీణించిన నిఫ్టీ, 600 పాయింట్లకు పైగా పడిపోయిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

నేటి ట్రేడింగ్ సెషన్లో బెంచిమార్కు సూచీలలో లాభాల బుకింగ్ మార్కెట్లను క్రిందికి లాగింది. ఆటో, మెటల్ మరియు బ్యాంకింగ్ స్టాక్స్ అమ్మకపు ఒత్తిడిని ఎదుర్కొన్నాయి.

నిఫ్టీ 1.81% లేదా 195.35 పాయింట్లు తగ్గి 10,607.35 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 1.80% లేదా 660.63 పాయింట్లు క్షీణించి 36,033.06 వద్ద ముగిసింది.

సుమారు 1829 షేర్లు క్షీణించాయి, 116 షేర్లు మారలేదు మరియు 820 షేర్లు పెరిగాయి.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ (1.94%), టైటాన్ కంపెనీ (0.92%), మరియు భారతి ఎయిర్‌టెల్ (0.27%) నిఫ్టీ లాభాలలో అగ్రస్థానంలో ఉన్నాయి. ఏదేమైనా, నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వారిలో ఇండస్ఇండ్ బ్యాంక్ (5.49%), యాక్సిస్ బ్యాంక్ (4.90%), ఐషర్ మోటార్స్ (4.47%), జీ ఎంటర్టైన్మెంట్ (4.32%), మారుతి సుజుకి (3.50%) ఉన్నాయి.

ఫార్మా మినహా అన్ని రంగాల సూచీలు ప్రతికూలంగా వర్తకం చేశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.95%, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.93% తగ్గాయి.

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్

డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీస్, యుఎస్ మార్కెట్లో తన ఓటిసి నికోటిన్ పోలాక్రిలెక్స్ లోజెంజ్లను ప్రారంభిస్తున్నట్లు కంపెనీ ప్రకటించిన తరువాత షేర్లు 1.94% పెరిగాయి మరియు  రూ. 3975.05 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

బిహెచ్ఇఎల్

కంపెనీ స్టాక్‌ను న్యూట్రల్ నుండి సెల్‌కు డౌన్ గేడ్ చేసిన తరువాత, ఒక్కో షేరుకు రూ. 34 ల లక్ష్య షేర్ ధరతో, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (బిహెచ్ఇఎల్) స్టాక్స్ 8.10% క్షీణించాయి మరియు  రూ. 39.15 ల వద్ద ట్రేడ్ అయ్యాయి 

ఫీనిక్స్ మిల్స్ లిమిటెడ్

ఎన్‌సిడిలు, ఈక్విటీ షేర్లు లేదా మరే ఇతర ఎంపికల ద్వారా నిధుల సేకరణకు కంపెనీ అనుమతి ప్రకటించిన తరువాత ఫీనిక్స్ మిల్స్ స్టాక్స్ 3.04% తగ్గాయి మరియు  రూ.575.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

యెస్ బ్యాంక్

ఈ బ్యాంక్ తన ఎఫ్.పి.ఓ యొక్క ఫ్లోర్ ధరను ఒక్కో షేరుకు రూ. 12 లు గా నిర్ణయించిన తరువాత ప్రైవేట్ ఋణదాత యొక్క అడ్డంకులు ఎఫ్.పి.ఓ పోస్ట్ ను కొనసాగించాయి. యెస్ బ్యాంక్ స్టాక్స్ వరుసగా మూడవ రోజు 5.22% క్షీణించి రూ. 20.90 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

ఎవెరెడీ ఇండస్ట్రీస్ ఇండియా లిమిటెడ్.

డాబర్ ప్రమోటర్లు కంపెనీలో 8.8% వాటాను భారీ ఒప్పందం ద్వారా కొనుగోలు చేసిన తరువాత, ఎవెరెడీ లిమిటెడ్ యొక్క స్టాక్స్ 10.00% పెరిగి రూ. 89.10 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. 

రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.

రేపు దాని ఎజిఎం కంటే ముందు, 12 లక్షల కోట్లకు పైగా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క స్టాక్స్ నేటి ట్రేడింగ్ సెషన్లో 1.03% తగ్గి, రూ. 1915.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. తన లక్ష్య తేది, మార్చి 2021 నాటికంటే ముందే కంపెనీ ఋణ రహిత మార్గంగా మారింది.

స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ లిమిటెడ్.

సంస్థ యొక్క చెన్నై ప్లాంట్లో తయారు చేయబోయే ఇయు కారవాన్ ట్రైలర్ మార్కెట్ కోసం 29,000 కంటే ఎక్కువ చక్రాల కోసం సంస్థ ఒక ఎగుమతి ఆర్డర్‌ను పొందింది. అయినా, కంపెనీ స్టాక్స్ స్వల్పంగా 0.75% క్షీణించి రూ. 438,75 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

భారతీయ రూపాయి

ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడిదారుల మధ్య ఉన్న ప్రతికూల భావాల వల్ల తగ్గిన భారత రూపాయి యుఎస్ డాలర్‌తో 75.43 రూపాయలుగా ముగిసింది.

ముడి చమురు

యుఎస్ మరియు ఆసియా దేశాలలో పెరుగుతున్న కొరోనావైరస్ కేసులను నియంత్రించడానికి తాజా ఆంక్షల కారణంగా నేటి ట్రేడింగ్ సెషన్లో చమురు ధరలు తగ్గాయి. పెరుగుతున్న కేసులు, ముడి చమురు డిమాండ్‌ పట్ల భయాన్ని కలిగిస్తోంది.

బలహీనమైన గ్లోబల్ మార్కెట్లు

పెరుగుతున్న కొరోనావైరస్ కేసుల మధ్య ఆసియా మరియు యూరోపియన్ మార్కెట్లు నేటి ట్రేడింగ్ సెషన్‌లో ప్రతికూలంగా వర్తకం చేశాయి. పెరుగుతున్న కోవిడ్-19 కేసులు వ్యాపారులలో ప్రతికూల మనోభావాలను సృష్టించాయి. నాస్‌డాక్ 2.13%, ఎఫ్‌టిఎస్‌ఇ-100, 0.38 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.06 శాతం, నిక్కీ-225, 0.87 శాతం, హాంగ్ సెంగ్ 1.14 శాతం తగ్గాయి.