హావ్ మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్ ప్రెస్ తో చల్లని హావ్ మోర్ ఐస్ క్రీం ఇక ఇంటివద్దకు….

భారతదేశంలోని ప్రముఖ ఐస్ క్రీమ్ బ్రాండ్ ల్లో ఒకటైన హవ్మొర్, వినియోగదారులకు తన శ్రేణి ఐస్ క్రీమ్ ఉత్పత్తులను అందించేందుకు ఆన్ డిమాండ్ ఇ-కామర్స్ ప్లాట్ ఫామ్, డన్జో తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందుకు “హావ్ మోర్ ఐస్-క్రీమ్ ఎక్స్ ప్రెస్” స్టోర్ ను డుంజో డెలివరీ యాప్ లో లాంఛ్ చేశారు.

ఈ జాబితాలో అత్యధికంగా అమ్ముడుపోయే ఉత్పత్తులైన కుకీ అండ్ క్రీమ్, మామిడి మ్యాజిక్, జులూబార్, మట్కా కుల్ఫీ, నట్టి బెల్జియన్ డార్క్ చాక్లెట్, శాండ్‌విచ్ ఐస్ క్రీమ్, అమెరికన్ నట్స్, బ్లాక్ ఫారెస్ట్ ఐస్ క్రీమ్ కేక్, అల్ఫోన్సో మామిడి, కుకీ క్రీమ్, బటర్ స్కాచ్ వంటివి ఉన్నాయి.

ఆర్డర్‌ చేసిన ఉత్పత్తులను ప్రతి నగరంలోని హవ్‌మోర్ డెలివరీ స్థానాల నుండి డన్జో డెలివరీ భాగస్వామి సేకరిస్తారు మరియు భారత ప్రభుత్వం సలహా మేరకు అన్ని ముందు జాగ్రత్తలు మరియు పరిశుభ్రత చర్యలు తీసుకుని వినియోగదారులకు పంపిణీ చేయబడుతుంది.

హైద్రాబాద్, బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గురుగ్రామ్, జైపూర్, ముంబై మరియు పూణేలతో సహా 8 నగరాల్లో డెలివరీ సర్వీస్ ని నిర్వహిస్తున్నారు.

గృహ వినియోగం పట్ల వినియోగదారుల ప్రాధాన్యత యొక్క ప్రస్తుత మార్పును దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తులను సజావుగా డెలివరీ చేసేలా బ్రాండ్ ఆన్‌లైన్ డెలివరీ ప్లాట్‌ఫాం డన్జోతో ఒప్పందం చేసుకుంది . హావ్ మోర్ ఐస్-క్రీమ్ వినియోగదారులచే నడిచే బ్రాండ్ కావడంతో దాని ఉత్పత్తుల ద్వారా వినియోగదారులకు ఎంతో ఆనందం మరియు ఆనందాన్ని అందించాలనుకుంటుంది.