మనుషుల కదలికల్లో ఎంతమార్పో..! రిపోర్ట్‌ విడుదల చేసిన గూగుల్‌

సెలవు దొరికితే ఏ సినిమాకో, షికారుకో వెళ్లడం సగటు భారతీయుడి అలవాటు. సాధారణ రోజుల్లో అయితే బస్టాండ్లకు పోటెత్తుతారు. రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతాయి. పార్కులు నిండిపోతాయి. లాక్‌డౌన్‌ పుణ్యమా ఇవన్నీ బంద్‌. నిత్యావసరాల దుకాణాలు, మెడికల్‌ షాపులు మినహా..! దీంతో జనం ఇళ్లకే పరిమితమయ్యారు. దీనిపై ప్రముఖ సెర్చింజిన్‌ గూగుల్‌ ఆసక్తికర డేటా వెల్లడించింది. మొబైల్‌ లోకేషన్‌ డేటాను ఉపయోగించి దేశంలోని ప్రజల కదలికలకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. మొత్తం 131 దేశాలకు సంబంధించిన డేటాను కొవిడ్‌-19 కమ్యూనిటీ మొబిలిటీ రిపోర్ట్‌ పేరిట గూగుల్‌ విడుదల చేసింది.