గోల్డ్‌ ధరలు పైపైకి: మళ్లీ కొండెక్కిన బంగారం

కరోనా మహమ్మారితో స్టాక్‌మార్కెట్లు కుప్పకూలుతుండటంతో బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు, మరణాల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో మదుపుదారులు షేర్లను అమ్మి బంగారంలో పెట్టుబడులకు మొగ్గుచూపుతున్నారు. సంక్షోభ సమయంలో సురక్షిత సాధనంగా పసిడి వైపు ఇన్వెస్టర్లు పరుగులు పెడుతుండటంతో యల్లో మెటల్‌ మరింత ప్రియమైంది.

మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్‌లో శుక్రవారం పదిగ్రాముల స్వచ్ఛమైన బంగారం రూ 530 భారమై రూ 43,770కి చేరింది. ఇక రూ 1348 పెరిగిన వెండి కిలో ధర ఏకంగా రూ 41, 222కి ఎగబాకింది. ఇక రాబోయే రోజుల్లో బంగారం ధర మరింతగా పెరిగి రూ 45,000కు చేరువ కావచ్చని బులియన్‌ ట్రేడర్లు అంచనా వేస్తున్నారు.