ఫాల్కన్ సిన్సెరా ఎస్ఎన్ 832 ఐ టైర్

• 12 అంగుళాల నుండి 16 అంగుళాల వరకు 27 పరిమాణాలలో లభిస్తుంది
• మెరుగైన ట్రెడ్ సమ్మేళనం, మరింత లోతుగా ట్రెడ్, అసమాన ట్రెడ్ నమూనా, అధిక మైలేజ్ కోసం నిశ్శబ్ద పిచ్ వేరియేషన్, అదనపు సౌకర్యం, బలమైన పట్టు మరియు మంచి మన్నిక వంటి కొత్త విశిష్టతలను కలిగి ఉంటుంది
అక్టోబర్ 2019: జపనీస్ టైర్ తయారీదారు, ఫాల్కన్ టైర్ ఇండియా ప్రైవేట్. లిమిటెడ్ (ఎఫ్‌టిఐ) ఇటీవల భారతదేశంలో కార్ల విభాగం అవసరాలు తీర్చేలా తన కొత్త తరం స్టాండర్డ్ సిరీస్ టైర్లను – సిన్సెరా ఎస్ఎన్ 832 ఐ – విడుదల చేసింది. 12 అంగుళాల నుండి 16 అంగుళాల వరకు 27 వేర్వేరు పరిమాణాలలో లభించే ఈ టైర్లు చిన్న,మధ్యతరహా హ్యాచ్‌బ్యాక్‌లు, సెడాన్లు, ఎంయువిలు, కాంపాక్ట్ ఎస్‌యూవీల కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి, అభివృద్ధి చేయబడ్డాయి. వాహన యజమానులు ఈ టైర్లను భారతదేశం అంతటా ఉన్న అధీకృత ఫాల్కన్ టైర్ షాపులు, డీలర్లు, పంపిణీదారుల నుండి కొనుగోలు చేయవచ్చు.
యూరోపియన్ పోకడలను కలిగి ఉన్న తాజా సిన్సెరా SN832i టైర్లు కొత్త ట్రెడ్ సమ్మేళనం మరియు మరింత లోతుగా ట్రెడ్ తో ఉంటాయి, ఇవి అధిక మైలేజ్, అదనపు జీవితకాలాన్నిఅందిస్తాయి. కొత్త శ్రేణి టైర్లు – సౌకర్యం మరియు మన్నిక అనే టైర్ యొక్క రెండు ముఖ్యమైన అంశాలను మెరుగుపరచడానికి వీలుగా విస్తృత, సరళమైన పొడవైన కమ్మీలతో అసమాన ట్రెడ్ నమూనాను కలిగి ఉంటాయి. ఈ రెండు లక్షణాలతో పాటు, కొత్త 4 రిబ్ పాటర్న్ డిజైన్ అనేది తడి పరిస్థితిలోనూ మంచి పట్టు అందించేందుకోసం విస్తృత, సూటి మరియు లేటరల్ గ్రూవర్స్ ను కలిగి ఉంటుంది.
మార్కెట్ లోకి దీని ప్రవేశం గురించి ఫాల్కన్ టైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సతోరు ఉషిదా మాట్లాడుతూ, “మా తాజా శ్రేణి టైర్ల ద్వారా, భారతీయ వాహన యజమానులకు విలువ-ఆధారిత ధరలకు ఉత్తమ తరగతి డ్రైవింగ్ అనుభవాలను అందించాలని మేము ఆశిస్తున్నాం. అగ్రశ్రేణి విశిష్టతలను – మెరుగైన మన్నిక, తడి పరిస్థితుల్లోనూ మంచి పట్టు, నిశ్శబ్ద పిచ్ వేరియేషన్ – సమ్మేళనం వినియోగ దారులందరి అవసరాలను తీర్చగలదు మరియు వారి కార్లకు SN 832i టైర్లు అమర్చేందుకు ఓ కారణం అందిస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో అగ్రశ్రేణి ఆవిష్కరణ అని మేము నమ్ముతున్నాం. దేశీయ టైర్ పరిశ్రమను దాని స్వంత, ప్రత్యేకమైన పద్ధతిలో మార్చడానికిది సహాయపడుతుంది ” అని అన్నారు.
ఫాల్కన్ టైర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ తన టైర్ల సరికొత్త శ్రేణిలో, ఒక ‘సైలెంట్ పిచ్ వేరియేషన్’ ను సమ్మి ళితం చేసింది. ఇది టైర్లను పిచ్ అమరికను అవలంబించడానికి మరియు లగ్ గ్రూవ్ వాల్యూమ్‌ను తగ్గించ డానికి వీలు కల్పిస్తుంది, తద్వారా మొత్తం పాటర్న్ శబ్దాన్ని తగ్గిస్తుంది. ఈ బ్రాండ్ డ్యూయల్ లేయర్ నైలాన్ బ్యాండ్ మరియు హై రిజిడిటీ స్టీల్ బెల్ట్ లతో పాటు 2 ప్లై సైడ్‌వాల్‌తో పాటు లాగ్నిట్యూడినల్ దృఢత్వం మరి యు టైర్ల మొత్తం మన్నికను మెరుగుపరుస్తుంది.