ఎడ్ టెక్ స్టార్ట్ అప్ అడ్డా 247 ఇన్ఫోఎడ్జ్ నేతృత్వంలోని సిరీస్ బి లో 6 మిలియన్లను సేకరించింది

• ఈ రోజు $ 10 మిలియన్ మొత్తం సేకరించింది
• ఎయిమ్స్, నూతన పరీక్షలో విభాగాలను విస్తరించేందుకు, ఈ వేదికకు కొత్త భాషలు జోడించింది మరియు భారతదేశమంతటా తన ఉనికిన చాటుకుంది

ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్, అడ్డా247, ఇన్ఫోఎడ్జ్ (ఇండియా) లిమిటెడ్ మరియు ఆశా ఇంపాక్ట్ నేతృత్వంలోని సిరీస్ బి నిధులలో 6 మిలియన్లను సమీకరించింది. అడ్డా247 యొక్క ప్రస్తుత పెట్టుబడిదారుడు ఎస్ టిఎల్ కూడా తాజా రౌండ్లో పాల్గొంది. ఈ నిధుల సమీకరణతో, అడ్డా247, ఇప్పటి వరకు మొత్తం 10 మిలియన్లను సేకరించింద. కొత్త పరీక్షా వర్గాలకు విస్తరించడానికి, ప్లాట్‌ఫామ్‌లో కొత్త భాషలను జోడించడానికి మరియు దాని భారతదేశవ్యాప్త ఉనికిని విస్తరించడానికి ఎడ్-టెక్ ప్లేయర్ ఈ నిధులను ఉపయోగించుకోవాలని యోచిస్తోంది.

2010 లో అనిల్ నగర్ & సౌరభ్ బన్సాల్ స్థాపించిన అడ్డా247, లైవ్ వీడియో క్లాసులు, ఆన్-డిమాండ్ వీడియో కోర్సులు, మాక్ టెస్ట్ & ప్రభుత్వ పరీక్షలపై దృష్టి సారించిన పుస్తకాలు వంటి ఉత్పత్తులను అందించే సమగ్ర ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. ఈ శక్తివంతమైన టెక్నాలజీ ప్లాట్‌ఫాం, గత 3 సంవత్సరాల్లో 10 రెట్ల వృద్ధిని సాధించింది. ఇది బహుళ పరీక్ష-నిర్దిష్ట ప్రసిద్ధ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లను కూడా నిర్వహిస్తుంది, వీటిలో – bankersadda.com, sscadda.com, teachersadda.co.in మరియు careerpower.in ఉన్నాయి.

“అడ్డా247 అనేది ఇంటింటికి సుపరిచితమన పేరు, ముఖ్యంగా మా లక్ష్య ప్రేక్షకులకు ఇది సుపరచితం. గత సంవత్సరం, ప్రభుత్వ ఉద్యోగాలలో (బ్యాంకింగ్ మరియు ఎస్ఎస్ పి వర్గాలు) ఎంపికైన అభ్యర్థులలో 90% కంటే ఎక్కువ మంది పరీక్షల తయారీ కోసం ఒకటి లేదా మరెన్నో అడ్డా 247 సేవలను ఉపయోగించారు. మా వేదిక్లో 40 మిలియన్లకు పైగా వినియోగదారులు మరియు 3 మిలియన్లకు పైగా రోజువారి యాక్టివ్ యూజర్స్ (డిఎయు) తో, అడ్డా247 భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించబడే ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ వేదిక. మా వినియోగదారులలో 60% కంటే ఎక్కువ మంది టైర్ III నగరాలు మరియు చిన్న పట్టణాల నుండి వచ్చారు మరియు అక్కడే మేము అపూర్వమైన పెరుగుదల మరియు నియామకాలను చూస్తున్నాము. కొత్త పరీక్షా వర్గాలకు విస్తరించడానికి, స్థానిక సామర్థ్యాలను సృష్టించడానికి మరియు ప్రపంచ స్థాయి ఉత్పత్తిని నిర్మించడానికి ఈ నిధులు ఉపయోగించబడతాయి” అని అడ్డా 247 సహ వ్యవస్థాపకుడు మరియు సిఇఓ అనిల్ నగర్ అన్నారు.