శ్రీవారిని ద‌ర్శించుకున్న దీపిక-ర‌ణ్‌వీర్

బాలీవుడ్ బ్యూటీ దీపిక ప‌దుకొణే, స్టార్ హీరో ర‌ణ్‌వీర్ సింగ్ గ‌త ఏడాది డెస్టినేష‌న్ వెడ్డింగ్ జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. లేక్ కోమో వేదిక‌గా వీరి వివాహం జ‌ర‌గ‌గా, న‌వంబ‌ర్ 14న కొంక‌ణి వివాహ ప‌ద్ద‌తిలో, 15న సింధీ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగింది. ఇక 21న బెంగళూరులో, 28న ముంబయిలో వివాహ విందును ఏర్పాటు చేశారు. అయితే వీరిరివురి వివాహం జ‌రిగి నేటితో ఏడాది పూర్తైంది. ఈ నేప‌థ్యంలో వెడ్డింగ్ యానివ‌ర్స‌రీ సెల‌బ్రేష‌న్స్‌లో భాగంగా బాజీరావ్ మ‌స్తానీ న‌టులు బుధ‌వారం స్పెష‌ల్ జెట్‌లో తిరుప‌తి చేరుకున్నారు. వారితో పాటు ఫ్యామిలీ కూడా తిరుప‌తి వెళ్ళారు. అయితే కొద్ది సేప‌టి క్రితం దీపికా-ర‌ణ్‌వీర్‌లు తిరుమ‌ల‌లోని బాలాజీ ఆల‌యాని సంద‌ర్శించి స్వామి వారి ఆశీస్సులు పొందారు.ఇద్ద‌రు రెడ్ అండ్ గోల్డ్ ట్రెడిష‌న‌ల్ ఔట్‌ఫిట్‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్ర‌స్తుతం వారి ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. దీపికా- ర‌ణ్‌వీర్ జంట ప‌ద్మావ‌తి ఆల‌యాల‌ని కూడా సంద‌ర్శించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఆ త‌ర్వాత అమృత్‌స‌ర్‌లో గోల్డెన్ టెంపుల్‌కి కూడా వెళ్ళ‌నున్నార‌ట‌. వీరిద్ద‌రు క‌పిల్ దేవ్ బ‌యోపిక్ 83లో క‌లిసి న‌టించ‌గా, ఈ చిత్రం వ‌చ్చే ఏడాది ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.