బాలీవుడ్-ఆధారిత షో, ‘Dabangg – The Animated Series’ ను ప్రారంభించిన కార్టూన్ నెట్వర్క్

సరికొత్త యానిమేటెడ్ అవతార్‌లో అత్యంత ప్రియమైన, భయమంటేనే తెలియని, సూపర్ కాప్ ‘Chulbul Pandey’ ను స్వాగతించండి. WarnerMedia పిల్లల ఛానెల్ అయిన, Cartoon Network, భారతదేశంలోని యువ అభిమానులను మే 31 నుండి ప్రతి రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి తన తాజా యాక్షన్-కామెడీ ‘Dabangg – The Animated Series’ తీసుకు వచ్చినది. WarnerMedia మరియు Cosmos-Maya సమన్వయం, ఆ స్టార్ ను ఒక కిడ్ గా తిరిగి చిత్రించడానికి బదులుగా, ప్రముఖ బాలీవుడ్ పాత్ర అసలు వెర్షన్ ఏమాత్రం దెబ్బతినకుండా అందులో ఎలాంటి మార్పులు చేయకుండా చిత్రీకరించిన మొదటి యానిమేటెడ్ సిరీస్‌ గా నిలుస్తుంది.

బాలీవుడ్ లోని అత్యంత ప్రసిద్ధ సూపర్-కాప్ ఫ్రాంచైజీలలో ఒకదాని స్ఫూర్తితో ఈ సరికొత్త హోమ్ గ్రోన్ IP ప్రారంభించినదానికి గుర్తుగా, Cartoon Network తన #ThankYouForBeingDabangg ప్రచారాన్ని కూడా ప్రారంభిస్తోంది. “పిల్లలు మరియు వారి కుటుంబాలతో సహా దీన్ని ఇష్టపడతారు! మా కొత్త యానిమేటెడ్ యాక్షన్-కామెడీ చాలా సరదాగా ఉంటుంది మరియు దేశంలో కెల్లా అతి చమత్కారమైన పోలీసైన ఈ చుల్బుల్ పాండే పాత్రతో మిమ్మల్ని అలరిస్తుంది. Cosmos-Maya తో కలిసి ఎంతో ఆశాజనకంగా ఉన్న మరో ప్రాజెక్ట్ కోసం పనిచేయడం చాలా బాగుంది.” Cartoon Network మరియు POGO, సౌత్ ఆసియా నెట్‌వర్క్ హెడ్ అభిషేక్ దత్తా వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *