ముంబయిలో 10వేలు దాటిన కేసులు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10వేల మార్కు దాటింది. ఇవాళ ఒక్కరోజే కొత్తగా 769 కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 10,527కి చేరింది. తాజాగా 25 మంది మరణించారని, దీంతో మొత్తం మృతుల సంఖ్య 412కి చేరిందని బృహన్‌ ముంబయి మున్సిపల్‌ కార్పొరేషన్‌ ప్రకటించింది.