క‌రోనా వైర‌స్ ఫోటోల‌ను విడుదల చేసిన ఐజేఎంఆర్

భార‌తీయ శాస్త్ర‌వేత్త‌లు క‌రోనా వైర‌స్‌కు సంబంధించిన మైక్రోస్కోప్ చిత్రాల‌ను రిలీజ్ చేశారు. SARS-CoV-2 వైర‌స్‌కు సంబంధించిన ఫోటోల‌ను ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ మెడిక‌ల్ రీస‌ర్చ్‌లో ప్ర‌చురించారు.  జ‌న‌వ‌రి 30వ తేదీన కేర‌ళ‌లో తొలి క‌రోనా కేసు న‌మోదు అయ్యింది. ఆ పేషెంట్ గొంతు నుంచి సేక‌రించి శ్యాంపిల్‌ను వైద్యులు ప‌రిశోధ‌న‌శాల‌లో ప‌రీక్షించారు. ఆ శ్యాంపిళ్ల‌ను మైక్రోస్కోప్‌లో ప‌రీక్షించిన శాస్త్ర‌వేత్త‌లు.. కోవిడ్‌19 వ్యాధికి సంబంధించిన వైర‌స్‌ను గుర్తించారు.  ఐజేఎంఆర్ త‌న ప్ర‌చుర‌ణ‌లో క‌రోనా వైర‌స్ మైక్రోస్కోప్ చిత్రాల‌ను వివ‌రిస్తూ నివేదిక‌ను రాసింది.