భారత్‌లో కరోనాతో 149 మరణాలు, 5194 కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ మహమ్మారి అత్యంత వేగంగా విస్తరిస్తోంది. బుధవారం ఉదయానికి దేశంలో కరోనా బాధితుల సంఖ్య 5194కి చేరిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది. మరణాల సంఖ్య 149కి చేరింది. మరో 4643మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం బాధితుల్లో 402మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల్లో 70మంది విదేశీయులే ఉన్నారు.

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గత 24గంటల్లో కొత్తగా 773 పాజిటివ్‌ కేసులు, 35 మరణాలు సంభవించాయి. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలోనే అత్యధికంగా ఇక్కడ 64మంది కరోనాతో మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1018కి చేరింది.