రియల్ ఎస్టేట్ రంగానికి కరోనా దెబ్బ…

కరోనా వైరస్‌ రియల్ ఎస్టేట్ రంగాన్ని ఘోరంగా దెబ్బతీసింది. ప్రాజెక్టులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ముఖ్యంగా దేశవ్యాప్త లాక్ డౌన్ కారణంగా భవన నిర్మాణ కార్మికులు పనులుకు రాకుండా ఆగిపోయారు. అంతేకాదు అటు సిమెంట్, స్టీల్ సహా ఇతర ఉత్పత్తుల తయారీ రంగం కూడా నిలిచిపోయింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ రంగానికి ఇది కోలుకోలేని దెబ్బగా మారింది. ముఖ్యంగా ప్రాజెక్టులు నిలిచి పోతే అది రియల్ ఎస్టేట్ రంగానికి పెద్ద దెబ్బ అనే చెప్పాలి. ముఖ్యంగా పనుల్లో జాప్యం కారణంగా, ప్రాజెక్టు అనుకున్న సమయం కన్నా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అలాగే భవిష్యత్తులో కరోనా కారణంగా బ్యాంకులకు లిక్విడిటీ సమస్య ఏర్పడే అవకాశం ఉందని, ఇదే జరిగితే నిధుల సమస్య కూడా తలెత్తే సమస్య రావొచ్చని అంచనా వేస్తున్నారు.