అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో క్రానిక్ అబ్‌స్ట్ర‌క్టివ్ ప‌ల్మ‌న‌రీ డిజార్డ‌ర్ (సీఓపీడీ) పై అవ‌గాహ‌న క్యాంప్‌

అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో ఊపిరితిత్తుల శ్వాస పక్రియ‌లో అడ్డంకులు ఎదుర‌య్యే దీర్ఘ‌కాల వ్యాధి (Chronic Obstructive Pulmonary Disorder- COPD) దినం పుర‌స్క‌రించుకొని ఎల్‌బీన‌గ‌ర్‌లో హైద‌రాబాద్‌లోని న‌గ‌ర వాసుల‌కు అవ‌గాహ‌న కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. ప్ర‌తి ఏటా, న‌వంబ‌ర్ 20వ తేదీన సీఓపీడీ డే నిర్వ‌హిస్తున్నారు. ఈ కార్య‌క్ర‌మం ద్వారా సీఓపీడీ వ్యాధిపై మ‌రింత అవ‌గాహ‌న క‌ల్పించడంతో పాటుగా సీఓపీడీ వ‌ల్ల ఓ వ్య‌క్తిపై ప‌డే ప్ర‌భావం గురించి తెలియ‌జెప్పారు.

అవేర్ గ్లెనిగ‌ల్స్ గ్లోబ‌ల్ హాస్పిట‌ల్స్ ప‌ల్మ‌నాల‌జీ సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ డాక్ట‌ర్ సుధీర్ ప్ర‌సాద్ ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ “భార‌త‌దేశంలో సీఓపీడీ వ‌ల్ల ప్ర‌తి ఏటా స‌గం మిలియ‌న్ మంది ప్ర‌జ‌లు క‌న్నుమూస్తున్నారు. ఈ సంఖ్య యూర‌ప్‌, అమెరికాలో మ‌రణిస్తున్న వారి కంటే నాలుగు రెట్లు అధికం. సీఓపీడీకి సంబంధించిన అంశాలైన వ్యాధి సంక్ర‌మ‌ణ‌, విస్త‌రించ‌డం, మ‌రియు సంభ‌విస్తున్న మ‌ర‌ణాలు అత్య‌వ‌స‌ర వైద్య‌సేవ‌లు, గ‌త రెండు ద‌శాబ్ధాలుగా మ‌హిళ‌ల్లో విస్త‌రిస్తున్న తీరు గురించి వివ‌రించ‌డం సైతం వంటివి ఉన్నాయి. 2030 సంవ‌త్స‌రం నాటికి సంభ‌వించే మొత్తం మ‌ర‌ణాల్లో సీఓపీడీ వ‌ల్ల క‌లిగేవే ఎక్కువ‌గా ఉండ‌నున్న‌ట్లు అధ్య‌య‌నాలు పేర్కొంటున్నాయి. రాబోయే రెండు ద‌శాబ్ధాల కాలంలో సీఓపీడీ వ‌ల్ల సంభ‌వించే మ‌ర‌ణాల సంఖ్య 160% పైగా పెరుగుతుంద‌ని నివేదిక‌లు వెల్ల‌డించడం మ‌రింత ఆందోళ‌న క‌లిగించే అంశం.“ అని తెలియజేశారు.

డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ సార‌థ్యంలోని ఫిజియోథెర‌పీ బృందం ఊపిరితిత్తుల శ్వాస పక్రియ‌కు అంశాలను వివరంగా ఈ సందర్భంగా తెలియజేసింది.

శ్వాస ప్రక్రియలో అడ్డంకుల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకునేందుకు తీసుకోవాల్సిన ఆరోగ్య సంబంధ‌మైన స‌హాయ‌క చ‌ర్య‌ల గురించి, సీఓపీడీకి సంబంధించి పొందాల్సిన వైద్య సేవ‌ల గురించి ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. సీఓపీడీకి చెందిన ప‌లు సూచ‌న‌ల‌ను సైతం ఈ బృందం హాజ‌రైన వారికి తెలియ‌జెప్పింది.

సీఓపీడీకి సంబంధిత వ్యాధికి చెందిన ద‌గ్గు వంటి ల‌క్ష‌ణాల్లో మ్యూక‌స్ (పొగ తాగే వారి యొక్క ద‌గ్గు), శ్వాస తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు (ప్ర‌ధానంగా వ్యాయామం చేసే స‌మ‌యంలో ఇబ్బందులు ఎదుర్కోవ‌డం), శ్వాసనాళం స‌మ‌స్య‌లు, చాతిలో ప‌ట్టేసిన‌ట్లు ఉండ‌టం వంటివి పేర్కొన‌వ‌చ్చు. చాతిలో ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను మునుపు లేనంత తీవ్ర స్థాయిలో ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. దీర్ఘ‌కాలంలో వాటి ప్ర‌భావాలు సైతం ఎక్కువ‌గా ఉంటాయి.