అక్కడ ఎదురుచూపులు.. ఇక్కడ ఎదురుకా ల్పులు

వాఘా సరిహద్దు వద్ద వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ కోసం భారత దేశమంతా ఎదురుచూస్తున్న సమయంలోనే జమ్ముకశ్మీర్‌లో మిలిటెంట్లతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు.

కుప్వారా జిల్లాలోని హంద్వారా ప్రాంతంలో మిలిటెంట్లు తలదాచుకున్న ఇంటిపై భద్రతాబలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దాడి చేసినప్పుడు ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ కాల్పుల్లో మిలిటెంట్లు తలదాచుకున్న ఇల్లు ధ్వంసం కాగా పాటు ఇద్దరు మిలిటెంట్ కూడా చనిపోయినట్లు భద్రతాబలగాలు భావించాయి.

ధ్వంసమైన ఇంటి వద్దకు వెళ్లగానే చనిపోయినట్లుగా భావించిన మిలిటెంట్లలో ఒకరు లేచి ఒక్కసారిగా కాల్పులు జరిపాడు.

ఈ అనూహ్య దాడిలో సీఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ ఒకరు, మరో జవాన్.. ఇద్దరు జమ్ముకశ్మీర్ పోలీసులు మృతిచెందారు.

మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు.