అధికంగా ముగిసిన బెంచిమార్కు సూచీలు; 11,100 మార్కును దాటిన నిఫ్టీ, 300 పాయింట్లకు పైగా లాభపడిన సెన్సెక్స్

అమర్ దేవ్ సింగ్, హెడ్ అడ్వైజరీ, ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్

ఆర్థిక మరియు ఐటి స్టాక్స్ నేతృత్వంలోని నేటి ట్రేడింగ్ సెషన్లో భారత మార్కెట్లు అధికంగా ముగిశాయి.

నిఫ్టీ 0.89% లేదా 98.50 పాయింట్లు పెరిగి 11,200.15 వద్ద ముగియగా, ఎస్ అండ్ పి బిఎస్ఇ సెన్సెక్స్ 0.96% లేదా 362.12 పాయింట్లు పెరిగి 38,025.45 వద్ద ముగిసింది.

సుమారు 1567 షేర్లు పెరగతా, 1056 షేర్లు క్షీణించగా, 167 షేర్లు మారలేదు.

టాప్ నిఫ్టీ లాభాలలో ఇన్ఫోసిస్ (2.89%), బజాజ్ ఫైనాన్స్ (2.54%), గెయిల్ (2.63%), హెచ్‌సిఎల్ టెక్ (2.18%), యుపిఎల్ (2.51%) ఉన్నాయి. నిఫ్టీ నష్టపోయిన వారిలో శ్రీ సిమెంట్స్ (1.15%), ఐషర్ మోటార్స్ (1.29%), అదానీ పోర్ట్స్ (0.93%), ఎం అండ్ ఎం (0.57%), భారతి ఎయిర్‌టెల్ (0.35%) ఉన్నాయి.

ఐటి, మెటల్, ఎఫ్‌ఎంసిజి, ఫార్మా రంగాలు 1% కంటే ఎక్కువ పెరిగాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ 0.77 శాతం, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్ 0.99 శాతం పెరిగాయి.

బ్లూ స్టార్ లిమిటెడ్

కంపెనీ నికర నష్టం రూ. 20 కోట్లు కాగా, కంపెనీ ఆదాయం 60% తగ్గింది. అయితే కంపెనీ స్టాక్స్ 4.40% పెరిగి రూ. 505.00 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

యునిచెమ్ లాబొరేటరీస్ లిమిటెడ్

యు.ఎస్.ఎఫ్.డి.ఎ నుండి టోల్టెరోడిన్ టార్ట్రేట్ టాబ్లెట్ల కోసం కంపెనీ ఎ.ఎన్.డి.ఎ అనుమతి పొందింది. నేటి ట్రేడింగ్ సెషన్‌లో కంపెనీ స్టాక్స్ 1% పెరిగి రూ. 263.15 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

స్టీల్ స్ట్రిప్స్ వీల్స్ లిమిటెడ్

యుఎస్ ట్రక్ మరియు కారవాన్ ట్రైలర్ మార్కెట్ కోసం 6,000 చక్రాల కోసం సంస్థ ఎగుమతి ఆర్డర్‌ను పొందింది. సంస్థ యొక్క చెన్నై ప్లాంట్ నుండి ఆగస్టు నెలలో ఈ ఆర్డర్ అమలు చేయబడుతుంది. కంపెనీ స్టాక్స్ 2.02% పెరిగి రూ. 424,95 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

యెస్ బ్యాంక్ లిమిటెడ్

సమస్యాత్మక ప్రైవేట్ బ్యాంక్ షేర్లను ఎల్ఐసి కొనుగోలు చేసిన తరువాత యెస్ బ్యాంక్ లిమిటెడ్ స్టాక్స్ 4.67% పెరిగి రూ. 13.45 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

హిందుస్తాన్ జింక్ లిమిటెడ్

గ్లోబల్ రీసెర్చ్ సంస్థ సిటి యొక్క స్టాక్లపై కొనుగోలు కాల్ ను కొనసాగించింది మరియు దాని లక్ష్యం ధరను ఒక్కో షేరుకు రూ. 240 లకు పెంచింది. ఫలితంగా కంపెనీ స్టాక్స్ 8.32% పెరిగి రూ. 236.95 ల వద్ద ట్రేడ్ అయ్యాయి.

జెకె లక్ష్మి సిమెంట్ లిమిటెడ్

ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ బలహీనమైన ఆదాయాన్ని నివేదించిన తరువాత జెకె లక్ష్మి సిమెంట్ లిమిటెడ్ షేర్లు 4.13% తగ్గి రూ. 285.55 ల వద్ద ట్రేడ్ అయ్యాయి. సంస్థ యొక్క ఏకీకృత నికర లాభం 5.80% తగ్గాయి, కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం 19.78% తగ్గింది.

లూపిన్ లిమిటెడ్

కాంకర్డ్ బయోటెక్‌తో కంపెనీ పొత్తు పెట్టుకున్న తర్వాత లూపిన్ లిమిటెడ్ స్టాక్స్ 0.81% పెరిగి రూ. 935.50 వద్ద ట్రేడ్ అయ్యాయి. మైకోఫెనోలేట్ మోఫెటిల్ టాబ్లెట్ల కోసం యుఎస్‌ఎఫ్‌డిఎ అనుమతి పొందినట్లు ఈ కంపెనీ ప్రకటించింది.

గుజరాత్ పిపావవ్

గుజరాత్ పిపావావ్ పోర్ట్ లిమిటెడ్ యొక్క ఏకీకృత నికర లాభం 12.5% క్షీణించగా, ఆర్థిక సంవత్సరం 21 మొదటి త్రైమాసంలో కంపెనీ ఆదాయం 10.5 శాతం తగ్గింది. అయితే కంపెనీ స్టాక్స్ 0.67% పెరిగి రూ. 74.95 వద్ద ట్రేడ్ అయ్యాయి.

భారతీయ రూపాయి

దేశీయ ఈక్విటీ మార్కెట్లలో కొనుగోలు మధ్య అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి రూ. 74.87 వద్ద ట్రేడయింది. రెపో రేటును 4% వద్ద మార్చకుండా ఉండాలని ఆర్.బి.ఐ నిర్ణయించిన తరువాత ఈ ధోరణి కనిపించింది.

బలహీన పడిన ప్రపంచ మార్కెట్లు

నేటి ట్రేడింగ్ సెషన్‌లో ఆసియా మరియు యూరోపియన్ మార్కెట్లు బలహీనంగా వర్తకం చేశాయి. నాస్‌డాక్ మినహా ప్రధాన మార్కెట్ సూచీలు 0.52% పెరిగాయి. ఎఫ్‌టిఎస్‌ఇ 100 1.97 శాతం, ఎఫ్‌టిఎస్‌ఇ ఎంఐబి 1.60 శాతం, నిక్కీ 225 0.43 శాతం, హాంగ్ సెంగ్ 0.69 శాతం తగ్గాయి.