హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద తొలి మైక్రోబ్రూవరీ “బార్లీ అండ్ గ్రేప్స్


మార్చ్, 2022 హైదరాబాద్: హైదరాబాదీలకు పార్టీ అయిపోవడం అనే మాటే ఉండదు. హైదరాబాద్ లో భారతదేశంలోనే మొదటి విమానాశ్రయ బ్రూవరీ కారణంగా బీర్ ప్రవాహం ఇకపై ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుంది. హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు సమీపంలో ‘బార్లీ అండ్ గ్రేప్స్’ సంస్థ ఏర్పాటుచేసిన కెఫే నగర ప్రజలకోసం 24 గంటలపాటు తెరిచే ఉండనుంది.

బార్లీ అండ్ గ్రేప్స్ (బీ అండ్ జీ) కెఫే 2013లో బెంగళూరులో ఏర్పాటైంది. ప్రస్తుతానికి బెంగళూరులో 4 ఔట్ లెట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మొట్టమొదటి మైక్రో బ్రూవరీని ప్రారంభించామని తెలిపేందుకు ఎంతో సంతోషిస్తున్నాం.

ఈ బ్రూవరీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఆర్జీఐఏ లోని ఏరోప్లాజా వద్ద వేడుక ఏర్పాటుచేశాం. నగరంలోని బ్లాగర్లు వైన్&డైన్ కోసం ఇక్కడకు వచ్చారు. దీంతోపాటుగా ఇక్కడ హైదరాబాద్ ఫెవరిట్ బ్యాండ్ అయిన ‘త్రీయరీ’ని కూడా ఏర్పాటుచేశాం. బీ&జీలో ఆనందభరితమైన, ప్రశాంతమైన వాతావరణంలో మీకు నచ్చిన బీర్టెల్స్ ఆస్వాదించేందుకు వీలుంటుంది.

బీర్టెల్స్ అనే పదం మీకు కొత్తగా అనిపించవచ్చు. బీటల్స్ థీమ్డ్ క్రాఫ్ట్ బీర్స్ నే ‘బీర్టెల్స్’ అంటారు. ఇక్కడి వాతావరణం, తాజాగా బ్రూ చేసిన బీర్లు వినియోగదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

ఈ కెఫే లో ఏర్పాటుచేసిన సంసెవీరియా, అగ్లోనెమా, అరెకా పామ్స్, స్పతిఫైలమ్ మొదలైన వివిధరకాలకు చెందిన 300 మొక్కలు వాతావరణంలోని విషపధార్థాలను తీసుకుని గాల్లోకి ఆక్సీజన్ ను విడుదల చేస్తాయి. దీంతో ఈ ప్రాంగణ వాతావరణం స్వచ్ఛంగా, ఆరోగ్యకరంగా ఉంది. నిత్యం బిజీగా ఉండే నగరంలోని కాలుష్యభరిత వాతావరణం నుంచి ఇక్కడ మీకు ఎంతో ఉపశమనం లభిస్తుందని మేం ధీమాగా చెప్పగలం.
ఈ కెఫే లో విశాలమైన ఇండోర్, ఔట్ డోర్ సీటింగ్ ఏరియా కారణంగా.. పగలు, రాత్రి అని తేడా లేకుండా పార్టీలు, కన్సర్ట్స్, గిగ్స్ ఏర్పాటుచేసుకునేందుకు తగినంత స్థలం అందుబాటులో ఉంది.

ఇక వైన్ విషయానికి వస్తే.. బీ&జీ మెనూ నగర ప్రజలను కచ్చితంగా ఆకట్టుకోవడంతోపాటు ప్రత్యేకమైన రుచులను ఆకర్షణీయమైన మెనూ ద్వారా అందిస్తున్నాం.

దేశంలోనే విలక్షణమైన బీ&జీ వంటి విలక్షణమైన కెఫే ఏర్పాటుచేయాలన్న ఆలోచన మేఘన, శ్రీధర్ వకాడా లదే. ఈ కెఫే వేసే ప్రతి అడుగూ వారి ఆలోచన నుంచి పుట్టిందే.

ఆర్జీఐఏ ప్రాంగణంలోని ఈ కెఫే ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీధర్ వకాడా మాట్లాడుతూ.. ‘హైదరాబాద్ ఎయిర్ పోర్టు వద్ద తొలి మైక్రోబ్రూవరీని ఏర్పాటుచేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ పరిశ్రమకు కొంతకాలంగా చక్కటి ఆదరణ కనిపిస్తున్న నేపథ్యంలోనే మేము ఈ కెఫే ను ఏర్పాటుచేశాం. దీంతోపాటుగా వినియోగదారులు కూడా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని, నోరూరించే రుచుల కోసం ఎదురుచూస్తున్నారు. వారి ఆలోచనలకు అనుగుణంగానే ఈ కెఫే ను ప్రారంభించాం. హైదరాబాద్ నగరంలో పుట్టిన నేను ఇక్కడే ఈ విలక్షణమైన మైక్రోబ్రూవరీ కెఫే ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉంది’ అని అన్నారు.
IG – https://www.instagram.com/barleyandgrapescafe/