రూ.300 కోట్లతో తెలంగాణా ఊటీ గా మారనున్నఅనంతగిరి

రూ.300 కోట్లతో అనంతగిరి ప్రాంతాన్ని తెలంగాణ ఊటీగా అభివృద్ధి పరుస్తామని పర్యాటకశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ పేర్కొన్నారు. విద్యాశాఖమంత్రి సబితాఇంద్రారెడ్డితోకలిసి బుధవారం శ్రీనివాస్‌గౌడ్‌ వికారాబాద్‌ జిల్లా అనంతగిరి ప్రాంతంలోని వాచ్‌టవర్‌, వ్యూ పాయింట్‌, నందిఘాట్‌, శివారెడ్డిపేట్‌ చెరువులను పరిశీలించారు. అనంతరం హరిత రిసార్ట్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ఏండ్లుగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని చెప్పారు. అనంతగిరి అభివృద్ధిపై సీఎం ప్రత్యేకదృష్టి సారించారని చెప్పారు. బుగ్గరామేశ్వరం, సర్పన్‌పల్లి, ఎబ్బనూరు, అనంతగిరి ప్రాంతాలను కలిపి అద్భుతంగా తీర్చిదిద్దుతామని మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ పాల్గొన్నారు.