17వరకు అమెజాన్‌లో ఆపిల్ డేస్ సేల్

ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ తన సైట్‌లో ఆపిల్ డేస్ సేల్‌ను ప్రారంభించింది. రేపటి వరకు ఈ సేల్ కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు ఐఫోన్లపై భారీ తగ్గింపు ధరలను అందిస్తున్నారు. హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో ఐఫోన్లను కొనుగోలు చేస్తే రూ.7వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఐఫోన్ 11, 11 ప్రొలపై రూ.6వేల వరకు డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఐఫోన్ XR ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.42,990 ధరకు కొనుగోలు చేయవచ్చు. ఇక ఐప్యాడ్ 7వ జనరేషన్ ట్యాబ్లెట్‌పై రూ.3వేల ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీని ధర రూ.29,900గా ఉంది. అలాగే ఆపిల్ వాచ్ సిరీస్ 5 వాచ్‌లను రూ.40,990 ప్రారంభ ధరకు విక్రయిస్తున్నారు.