తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం

తెలంగాణలో ఫిబ్రవరి 1 నుంచి విద్యాసంస్థలు పున:ప్రారంభం కానున్నాయి. అన్ని విద్యా సంస్థల్లో కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులు, టీచర్లు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వివరాలు వెల్లడించారు.

నిజానికి మరో వారం పాటు విద్యా సంస్థలకు సెలవులు పొడగించవచ్చుననే ప్రచారం జరిగినప్పటికీ… ప్రభుత్వం విద్యా సంస్థలను తెరిచేందుకే నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో విద్యా సంస్థలకు ఈ నెల 30తో సెలవులు ముగుస్తుండటం… స్కూళ్ల ప్రారంభంపై వివరాలు తెలపాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో… విద్యా సంస్థల పున:ప్రారంభంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

మొదట ఈ నెల 8 నుంచి 16 వరకు విద్యా సంస్థలకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.