యాప్ ట్రేడింగ్ కోసం ఒక త్వరిత గైడ్ /మార్గదర్శిని

ఇంతకుముందు కాలంలో, కస్టమర్ యొక్క స్టాక్ ట్రేడింగ్ ను అమలు చేయడానికి కొంత రుసుము వసూలు చేసే స్టాక్ బ్రోకర్‌కు ఫోన్ కాల్ చేసి, అవసరమయ్యే స్టాక్‌లను కొనుగోలు చేయడం మరియు అమ్మడం చేస్తూండేవాళ్ళం. కానీ నేడు, మొబైల్ ఆధారిత స్టాక్‌ట్రేడింగ్‌కు అవకాశం విషయంలో భారతదేశం ప్రముఖ మార్కెట్లలో చేరవచ్చు. కస్టమర్ ఇప్పుడు తన అభిమాన బ్రోకర్ యొక్క మొబైల్ అప్లికేషన్ ద్వారా సొంతంగా వ్యాపారం చేయవచ్చు. ఈ బ్రోకింగ్ యాప్స్, కస్టమర్‌లు ఎలా ట్రేడింగ్ చేయవచ్చనే దానిపై పలు రకాల ఎంపికలను అందిస్తాయి. ఉదాహరణ, కొన్ని ఆటోమేటెడ్ ట్రేడింగ్ కలిగి ఉంటాయి, మరికొందరు ప్రారంభకులకు ప్రాథమిక శిక్షణను ఇవ్వవచ్చు, మరికొందరు ప్రొఫెషనల్ వ్యాపారులకు కొన్ని ముందస్తు ఫంక్షన్లను అందించవచ్చు, అన్నీ కొన్ని క్లిక్‌ల సౌలభ్యంతో చేయవచ్చు.

మొబైల్ యాప్ ట్రేడింగ్ కోసం కొన్ని చిట్కాలను పరిశీలిద్దాం –

చిట్కా 1: బ్రోకర్ గురించి పూర్తి పరిశోధన చేయండి

ఇంటర్నెట్‌లో మరియు అనుభవజ్ఞులైన వ్యాపారులతో మీ స్వంత పరిశోధన చేయండి. అనుభవజ్ఞులైన పెట్టుబడిదారులు/వ్యాపారుల సలహాలను వినండి కాని వారిని ఎప్పుడూ గుడ్డిగా అనుసరించవద్దు. స్టాక్ బ్రోకర్, నేపథ్యం మరియు బ్రోకర్ యొక్క ఖ్యాతి, ఖాతా ప్రారంభ ఛార్జీలు, దాచిన ఛార్జీలు, అందించే అదనపు సౌకర్యాలు మొదలైన వాటి గురించి కొంత ప్రాథమిక సమాచారాన్ని పొందండి.

చిట్కా 2: మొబైల్ యాప్ యొక్క అభిప్రాయాన్ని తనిఖీ చేయండి

మీరు బ్రోకర్‌ను ఎంచుకున్న తర్వాత, తదుపరి దశ వారు అందించిన అప్లికేషన్ యొక్క పనితీరును తనిఖీ చేయడం. యాప్ స్టోర్‌లోని సమీక్షలు మరియు రేటింగ్‌లను అర్థం చేసుకోండి మరియు తదనుగుణంగా నిర్ణయం తీసుకోండి.

చిట్కా 3: ఈ మొబైల్ యాప్, ఉపయోగించడానికి సులభమైనది, సురక్షితమైనది మరియు సంరక్షితమైనదని నిర్ధారించుకోండి

మీరు బ్రోకింగ్ యాప్ ను ఎంచుకున్నప్పుడు, ట్రేడింగ్‌ను సరళంగా చేయడానికి ఇది ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి. అలాగే, డౌన్‌లోడ్ చేసిన యాప్ ధృవీకరించబడటం, సురక్షితం మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి.

చిట్కా 4: బ్రోకర్ యొక్క కస్టమర్ సేవా నాణ్యతపై కొంత పరిశోధన చేయండి

యాప్ ద్వారా బ్రోకింగ్ చేసేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన దశ. ఏదైనా సాంకేతిక సమస్య కోసం వారి సహాయక బృందం లభ్యతను మీరు తనిఖీ చేస్తున్నారని నిర్ధారించుకోండి మరియు వారు సమస్యలను ఎంత త్వరగా పరిష్కరిస్తారో అర్థం చేసుకోండి.

చిట్కా 5: మీ మొబైల్‌లో ఇంటర్నెట్ కనెక్టివిటీ బలంగా మరియు సురక్షితంగా ఉందని నిర్ధారించుకోండి

నెమ్మదిగా ఇంటర్నెట్ కనెక్షన్ మీ బ్రోకింగ్ యాప్ ను వాస్తవ నిజ సమయాన్ని అప్‌డేట్ చేయడానికి అనుమతించదు మరియు ఇది మీ ట్రేడింగ్‌కు ఆటంకం కలిగించవచ్చు. ట్రేడింగ్ కోసం మంచి ఇంటర్నెట్ వేగం మరియు స్థిరమైన కనెక్షన్ అవసరం ఎందుకంటే మీరు మార్కెట్లో ఎక్కడ మరియు ఎప్పుడు అమ్మాలి మరియు కొనాలి అనే దానిపై శీఘ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

 

రచయిత:

రోహిత్ అంబోస్టా

అసోసియేట్ డైరెక్టర్ మరియు ఛీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్,  

ఏంజెల్ బ్రోకింగ్ లిమిటెడ్