3 నెలల బిల్లు వల్లే ఎక్కువ అనిపిస్తోంది

మూడు నెలల విద్యుత్‌ బిల్లు ఒక్కసారి ఇవ్వడం వల్లే వినియోగదారులకు బిల్లు ఎక్కువ వచ్చినట్లు అనిపిస్తోందని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. వాడిన యూనిట్లకే బిల్లులు ఇచ్చారు తప్ప.. అధికంగా ఒక్కరూపాయి కూడా బిల్లు వేయలేదని చెప్పారు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వడం వల్ల విద్యత్‌ వినియోగం పెరిగిందని, తద్వారా బిల్లు ఎక్కువ వచ్చిందని మంత్రి పేర్కొన్నారు