మహబూబ్‌నగర్‌లో 23 రోజుల పసికందుకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు జిల్లా కలెక్టర్ వెంకట్రావు వెల్లడించారు. మర్కజ్‌కు వెళ్లొచ్చినవారి ద్వారా కొత్తగా ముగ్గురికి కరోనా సోకినట్టు ఆయన తెలిపారు. మహబూబ్‌నగర్‌లో నిన్నటివరకు ఆరు కరోనా పాజిటివ్ కేసులు ఉన్న విషయం తెలిసిందే.
