తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 75 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ఇద్దరి మృతి

తెలంగాణలో రికార్డ్ స్థాయిలో ఒకే రోజు 75 కొత్త కరోనా పాజిటివ్ కేసులు ఇద్దరి మృతి.

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ఈ ఒక్క రోజే రాష్ట్రంలో 75 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు ప్రభుత్వం వెల్లడించింది.  దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 229కి పెరిగింది. అలాగే, రాష్ట్రంలో ఈ రోజు మరో ఇద్దరు మృత్యువాత పడటంతో మొత్తం మృతుల సంఖ్య 11కి చేరింది.