ముంబయిలో కరోనా కేసుల సంఖ్య 20 వేలకు చేరువలో ఉంది. ఇప్పటివరకు 19,967 కేసులు నమోదైనట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తెలిపారు. ఇందులో ఐదు వేలకుపైగా కోలుకొని డిశ్చార్జి అయ్యారని ఆయన చెప్పారు. ఇప్పటివరకు రాష్ట్రానికి ఐదు లక్షల మంది వలస కూలీలను రాష్ట్రానికి రప్పించామని ఉద్ధవ్ చెప్పారు. కాలినడకన సొంత ప్రాంతాలకు బయలుదేరవద్దంటూ ఆయన వలస కూలీలను కోరారు.
