నగరంలో కరోనా సోకిన వ్యక్తులు ఎక్కువున్న 12 ప్రాంతాలను జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్‌కుమార్ బుధవారం కంటైన్మెంట్ క్లస్టర్లుగా ప్రకటించారు. ఆ ప్రాంతాలను ఆధీనంలోకి తీసుకోవాలని యంత్రాంగానికి స్పష్టం చేశారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌తో చర్చించి నిర్ణయాలు తీసుకున్నామని కమిషనర్ తెలిపారు. రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలోనూ 3ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా గుర్తించారు.
నగరంలో 175 కరోనా కేసులు ఉండగా.. 12 ప్రాంతాల్లోనే 89 మంది వైరస్ బారినపడ్డారు. వదిలేస్తే పరిస్థితి చేజారుతుందని ఆ ప్రాంతాలను కంటైన్మెంట్ క్లస్టర్లుగా ప్రకటించారు.