హైదరాబాద్ లో ‘ప్రైడో’ క్యాబ్ సేవలు ప్రారంభం

  • సర్జ్ రహిత క్యాబ్ హెయిలింగ్ సేవలను ప్రారంభించిన హైదరాబాద్ కు చెందిన టెక్ స్టార్టప్ ‘ప్రైడో’ 
  • రానున్న రోజుల్లో న్యూఢిల్లీ, దేశవ్యాప్తంగా ఇతర మెట్రో నగరాల్లో సేవల విస్తరణ 
  • రూ.100 కోట్లు పెట్టుబడి పెట్టే యోచనలో ప్రైడో

ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన ప్రణీత్ గ్రూప్ చే ప్రమోట్ చేయబడిన, హైదరాబాద్ కు చెందిన టెక్ స్టార్టప్ వెంకట ప్రణీత్ టెక్నాలజీస్ ప్రై.లి. ఈరోజు హైదరాబాద్ లో ‘ప్రైడో’ పేరిట క్యాబ్ హెయిలింగ్ సేవలను ప్రవేశపెట్టింది. కంపెనీ ఇప్పటికే 14,000 మంది డ్రైవర్ భాగస్వాములను చేర్చుకోవడాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సేవలు 2019 సెప్టెంబర్ 29 నుంచి అధికారికంగా అందుబాటులోకి రానున్నాయి.

‘ప్రైడో’ మొబైల్ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ లో, ఐఒఎస్ యాప్ స్టోర్ లో నేటి నుంచి అందుబాటులోకి రానుంది. ‘ప్రైడో’ యొక్క ఈ విశిష్ట బిజినెస్ నమూనా వినియోగదారులకు సర్జ్ రహిత ప్రయాణాలకు వీలు కల్పిస్తుంది. డ్రైవర్ భాగస్వాములకు పలు రకాల సంక్షేమ చర్యలను అందిస్తుంది. హ్యాచ్ బ్యాక్, సెడాన్, ఎస్ యూవీ –అనే మూడు విభాగాల్లో ప్రైడో తన సేవలను అందించనుంది.

రానున్న ఆరు నెలల్లో ప్రైడో తన సేవలను ఢిల్లీ, బెంగళూరులకు విస్తరించే యోచనలో ఉంది. అంతేగాకుండా, కంపెనీ 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అన్ని మెట్రో నగరాలకు తన సేవలను విస్తరించనుంది. దేశవ్యాప్త విస్తరణకు గాను రూ.100 కోట్ల మొత్తాన్ని వెచ్చించేందుకు కంపెనీ యోచిస్తోంది.

ప్రైడో ఆవిష్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ప్రైడో వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్ నరేంద్ర కుమార్ కామరాజు మాట్లాడుతూ, ‘‘హైదరాబాద్ మార్కెట్ లో ప్రైడో క్యాబ్ హెయిలింగ్ సేవలను ప్రారంభించడం మాకెంతో ఆనందదాయకం. ప్రయాణికుల సురక్షిత, భద్రత, సౌలభ్యం మరియు డ్రైవర్ భాగస్వాముల సంక్షేమం అనేవి మాకు అత్యంత ముఖ్యమైనవి. ప్రయాణికుల భద్రత కోసం మేము ప్రైడో యాప్ ను తెలంగాణ ప్రభుత్వ హాక్ –ఐ యాప్ తో మిళితం చేశాం. క్యాబ్ హెయిలింగ్ పరిశ్రమ ఎంతో వృద్ధిఅవకాశాలను కలిగిఉందని మేము విశ్వసిస్తున్నాం. ఆ అవకాశాలను వెలికితీయాలని భావిస్తున్నాం. హైదరాబాద్ లో రానున్న 3 నెలల్లో పది లక్షల ప్రయాణాలు పూర్తి చేయగలమని మేము ఆశిస్తున్నాం’’ అని అన్నారు.

‘‘క్యాబ్ హెయిలింగ్ మార్కెట్ లో, పరిశ్రమలోనే మొదటిసారిగా అని చెప్పదగిన కొన్ని విప్లవాత్మక భావన లను మేము ప్రవేశపెడుతుండడం అనేది ప్రైడో క్యాబ్స్ కు గర్వకారణం. ‘హ్యాపీ డ్రైవర్స్ మేక్ హ్యాపీ రైడర్స్’ అని ప్రైడో క్యాబ్స్ విశ్వసిస్తోంది. ప్రైడో ఇటు వ్యాపారంలో, అటు మానసిక ప్రశాంతత లో సమాన అవకాశాలు పొందడంలో డ్రైవర్ భాగస్వాములకు సాధికారికత కల్పిస్తుంది’’ అని ఆయన అన్నారు.

నెలకు చేసే ప్రయాణాల సంఖ్యను బట్టి డ్రైవర్ భాగస్వాముల నుంచి ప్రైడో 0-10 % కమీషన్ ను వసూలు చేస్తుంది. వారిపై ఒత్తిడి లేకుండా చేసేందుకు గాను నెలవారీ ప్రాతిపదికన అత్యధిక సంఖ్యలో ప్రయాణాలకు తక్కువ /జీరో కమీషన్ ను కంపెనీ వసూలు చేస్తుంది. బిల్లింగ్, ఇన్వాయిస్ విధానాల్లో పారదర్శకతకు ప్రైడో హామీ ఇస్తుంది.

ప్రైడో దిగువ ఫీచర్లను అందిస్తుంది. ఇవి క్యాబ్ హెయిలింగ్ పరిశ్రమలోనే మొదటిసారిగా ప్రవేశపెట్టబడుతున్నాయి.

  • హామీపూర్వక ప్రయాణాలు –వినియోగదారు ముందుగానే తమ సౌలభ్యాన్ని బట్టి –ఒక వారం, ఒక నెల –ముందుగా నిర్ణయించుకున్న వేళలకు క్యాబ్ ను పొందే అవకాశాన్ని ఇది అందిస్తుంది. 
  • బల్క్ ప్రయాణాలు –ఇది ప్రత్యేక సందర్భాల కోసం రూపొందించిన ఫీచర్. యూజర్లు తమ వేడుకలకు హాజరయ్యే తమ అతిథుల కోసం నిర్దిష్ట సంఖ్య (బల్క్ గా)లో క్యాబ్ లను బుక్ చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఒక గమ్యస్థానం చేరుకునేందుకు పలు పికప్ పాయింట్లను మరియు పలు గమ్యస్థానాలకు ఒక పికప్ పాయింట్ ను ఎంచుకోవచ్చు.
  • రిటర్న్ కంపెన్సేషన్ –ప్రయాణికులను దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళి, తిరిగి బుకింగ్ లభించగల సమీప ప్రాంతానికి రావడంలో డ్రైవర్ భాగస్వాములు నష్టాలకు గురవుతుంటారు. అందుకే ప్రైడో హైదరాబాద్ చుట్టూరా జియో-ఫెన్సింగ్ నిర్దేశించింది. లాంగ్ డిస్టెన్స్ డ్రాప్ లొకేషన్ నుంచి జియో–ఫెన్సింగ్ ఏరియా వరకు రావడంలో డ్రైవర్ భాగస్వాములకు వాటిల్లే నష్టం నుంచి ఇది రక్షణ కల్పి స్తుంది.
  • లాంగ్ టర్మ్ పికప్ ఫీ –కొన్ని సందర్భాల్లో ప్రయాణికులు తమకు దగ్గర్లో క్యాబ్ పొందలేకపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ప్రయాణికులు గనుక కొంత ఎక్కువ మొత్తం చెల్లించేందుకు సిద్ధపడితే, కాస్తంత దూరం నుంచి కూడా వారి కోసం క్యాబ్స్ వచ్చేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ఈ అదనపు వ్యయాన్ని ప్రయాణికులు భరించాల్సి ఉంటుంది.