హైదరాబాద్ లో నోబ్రోకర్ డాట్ కామ్ సేవలు

కస్టమర్-టూ-కస్టమర్ రియల్ ఎస్టేట్ పోర్టల్‌గా ప్రసిద్ధి చెందిన నోబ్రోకర్ డాట్ కామ్ (NoBroker.com) తన కార్యకలాపాలను హైదరాబాద్ నగరానికి విస్తరించినట్టు ఈరోజు ప్రకటించింది. వినియోగదారు-స్నేహిత ప్రణాళికలతో ఇప్పటికే ముంబయ్, బెంగళూరు, పుణే, చెన్నై, మరియు గూర్గావ్‌ లాంటి నగరాల్లో వినియోగదారులను ఆకట్టుకున్న ఈ కంపెనీ ఇప్పుడు హైదరాబాద్ ప్రజల గృహ-అన్వేషణ మరియు సెటిల్మెంట్ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు సిద్ధమైంది. గృహ మరియు వాణిజ్య ఆస్తులకు సంబంధించిన అద్దె/కొనుగోలు/అమ్మకం లాంటి లావాదేవీలకు వేదికగా చిరపరిచితమైన ఈ కంపెనీ తన విశిష్ట బ్రోకరేజ్-ఫ్రీ వ్యవస్థ ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తోంది.

నోబ్రోకర్ డాట్ కామ్ CBO మరియు కో-ఫౌండర్, సౌరభ్ గార్గ్ మాట్లాడుతూ, “ఒక వ్యవస్థాపిత ఐ.టీ హబ్‌గా ఉన్న హైదరాబాద్‌కి తరలి వస్తున్న యువ వృత్తి నిపుణుల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉండడమే కాకుండా వారు నివాసం కోసం అన్వేషించడమూ పెరుగుతోంది. కొత్త-తరానికి చెందిన ఈ వినియోగదారులు తమ గృహ అన్వేషణ కోసం ప్రాపర్టీ బ్రోకర్ల మీద ఆధారపడడం లాంటి పాత-కాలం మార్గాలను ఇష్టపడడం లేదు. దానికి బదులుగా ఎలాంటి చికాకులూ లేని, స్వతంత్ర పద్ధతుల్లో ఇంటిని అన్వేషించడానికి ఇష్టపడుతున్నారు. బ్రోకర్లకు చెల్లించే బ్రోకరేజ్ ఛార్జీల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదని వారు భావిస్తున్నారు. మరోవైపు ఐ.టి మరియు ఇతర రంగాల్లోని అసంఖ్యాక ఉద్యోగాల వైపు ఆకర్షితమవుతున్న యువతరం ఈ నగరంలో ఇంటికోసం చేసే అన్వేషణలో మాలాంటి ఒక కంపెనీ అండను కోరుకుంటోంది” అని అన్నారు.

నోబ్రోకర్ డాట్ కామ్ CTO మరియు కో-ఫౌండర్, అఖిల్ గుప్త మాట్లాడుతూ, “2014లో నోబ్రోకర్ డాట్ కామ్ ప్రారంభమైన నాటి నుంచి భారతదేశపు గృహ మరియు వాణిజ్య రియల్ ఎస్టేట్ ప్రదేశాలను తన అధునాతన C2C విధానంతో సమూలంగా మార్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ వ్యవస్థలో బ్రోకర్లను తొలగించడంతో పాటు ఆస్తి అన్వేషణ వ్యవస్థలో పారదర్శకత తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. ఆ క్రమంలో ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా ప్యాకర్స్ అండ్ మూవర్స్, హోమ్ స్టోర్, హోమ్ క్లీనింగ్ లాంటి అనేక సర్వీసులు సైతం పరిచయం చేయడం జరిగింది. ఆవిధంగా నోబ్రోకర్ పే ద్వారా ఆస్తి అన్వేషణ తర్వాత కూడా వినియోగదారులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అక్కడ స్థిరపడడానికి అవకాశం లభిస్తోంది” అన్నారు.