హైదరాబాద్‌లో తెరుచుకున్న ఐటీ కార్యాలయాలు

ప్రభుత్వం అనుమతితో నగరంలో ఐటీ కార్యాలయాలు సోమవారం ఉదయం తెరుచుకున్నాయి. 33 శాతం ఉద్యోగులతో ఐటీ కంపెనీలు పని మొదలు పెట్టాయి. దీంతో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలు పెరిగాయి. కాగా కార్యాలయాలకు వస్తున్న సిబ్బంది నిబంధనలు పాటించాలని, మాస్కులు, శానిటైజర్స్ తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.