హెరిటేజ్‌ నుంచి ‘ఏ2’ పాలు

ప్రపంచ పాల దినోత్సవం సందర్భంగా వ్యాధినిరోధక శక్తిని పెంచే కొత్త పాలను హెరిటేజ్‌ ఫుడ్స్‌ విడుదల చేసిం ది. కంపెనీ కార్యాలయం, హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌ స్టోర్‌లో ‘ఏ2’ పాలను హెరిటేజ్‌ ఎండీ నారా భువనేశ్వరీ, ఈడీ బ్రహ్మణి మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఆరోగ్యంపై జాగ్రత వహించే వారికి ఈ పాలు చక్కటి ఎంపికని కంపెనీ పేర్కొంది. ఏ2 పాలు ప్రము ఖ రిటైల్‌ స్టోర్లు, బిగ్‌ బాస్కెట్‌ వంటి ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫారమ్‌లు, ఎంపిక చేసి స్టోర్లు, హెరిటేజ్‌ పార్ల ర్లు మొదలైన చోట లభిస్తాయి. 500 ఎంఎల్‌ ప్యాకెట్‌ ధర రూ.50. పాలలోని కాల్షియం, విటమిన్‌ డీ వంటి పదార్ధాలు శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెచుతాయని బ్రహ్మణి అన్నారు. మూడు నెలల పాటు ఈ పాలు నిల్వ ఉంటాయి.