సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ప్రతిపక్ష నేత చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. కరోనా, లాక్‌డౌన్ కారణంగా పేదలు, రైతులు కుదేలయ్యారని చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో వారిని వైసీపీ నేతలు విరాళాల పేరుతో వేధించడం దుర్మార్గమని తప్పుబట్టారు. వైసీపీ నేతలను చూస్తుంటే కరోనా భయాన్ని మించిన భయం కలుగుతోందన్నారు. సహాయ చర్యల్లో కూడా రాజకీయం చేయడం హేయమని ఆక్షేపించారు. తొలగించిన 25 లక్షల రేషన్ కార్డుదారులకు సాయం చేయకపోవడం దారుణమన్నారు. టెస్ట్‌లు పెరగకుండా కేసులు పెరిగినట్లుగా చూపిస్తున్నారని, నిన్న నెగటివ్‌గా చూపిన కేసులు ఈరోజు పాజిటివ్‌గా చూపిస్తున్నారని ఆరోపించారు. హెల్త్ బులెటిన్లు, రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, డ్యాష్ బోర్డ్ సమాచారంలో ఏది నిజమో తెలియక జనం ఆందోళన చెందుతున్నారని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.