సీఎం కేసీఆర్‌ సోదరి కన్నుమూత

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నివాసంలో విషాదం నెలకొంది. ఆయన సోదరి లీలమ్మ కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఈరోజు ఉదయం నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సోదరి మరణవార్త తెలుసుకున్న కేసీఆర్‌ దిల్లీ పర్యటనను అర్ధాంతరంగా ముగించారు. మధ్యాహ్నం దిల్లీ నుంచి హైదరాబాద్‌ చేరుకోనున్నారు. లీలమ్మ మృతిచెందినట్లు తెలుసుకున్న కేసీఆర్‌ బంధువులు, సన్నిహితులు ఆయన నివాసానికి తరలి వస్తున్నారు.