సినీనటుడు జయప్రకాశ్‌రెడ్డి కన్నుమూత

సినీనటుడు జయప్రకాశ్‌ రెడ్డి (74) కన్నుమూశారు. లాక్‌డౌన్‌ సమయం నుంచి గుంటూరు విద్యానగర్‌లో ఉంటున్న ఆయన మంగళవారం ఉదయం గుండెపోటుతో స్నానాల గదిలోనే కుప్పకూలారు. జయప్రకాశ్‌రెడ్డి స్వస్థలం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం సిరివెళ్ల. నాటకరంగంపై ఉన్న మక్కువతో ఆయన గుంటూరులోనే స్థిరపడ్డారు. జయప్రకాశ్‌రెడ్డికి భార్య రాజ్యలక్ష్మి, కుమారుడు చంద్రప్రతాప్‌రెడ్డి ఉన్నారు. 1946 మే 8న జన్మించిన ఆయన బ్రహ్మపుత్రుడు చిత్రం ద్వారా తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. దాదాపు వందకు పైగా తెలుగు, కన్నడ, తమిళ చిత్రాల్లో నటించారు. పలు చిత్రాల్లో ప్రతినాయకుడు, హాస్యనటుడిగా గుర్తింపు పొందారు. రాయలసీమ యాసలో సినీపరిశ్రమలో తనదైన ముద్ర వేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *