ఇంక్రెడిబుల్ ఇండియా ప్రాజె క్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (ఐఐపీపీఎల్).. శనివారం సికింద్రాబాద్‌లో తమ మూడో హోటల్‌ను ప్రారంభించింది. పార్క్ లేన్ వద్ద రూ.25 కోట్ల పెట్టుబడితో హో టల్ ఇంక్రెడిబుల్ వన్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ నిర్మాణ రంగ సంస్థ.. హాస్పిటాలిటీ రంగంలోకి గతేడాదే ప్రవేశించింది. లక్డికాపూల్‌లోని హోటల్ హాంప్‌షైర్ ప్లాజా, కొచ్చిలోని హోటల్ రాడిసన్ బ్లూ కొనుగోలుతో అడుగు పెట్టింది. త్వరలోనే తయారీ, హెల్త్‌కేర్, జ్యుయెల్లరీ రంగాల్లోకీ రాబోతున్నట్లు ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. తెలంగాణలో మహేశ్వరం, కొత్తూర్, భువనగిరి, జగదేవ్‌పూర్, యాదాద్రిల్లో ఐఐపీపీఎల్ నిర్మాణ ప్రాజెక్టులున్నాయి.
