సాన్యో 32 ఇంచుల స్మార్ట్ టీవీ రూ.12,999..!

ప్రముఖ ఎలక్ట్రానిక్స్ తయారీదారు పానాసోనిక్‌కు చెందిన సబ్‌బ్రాండ్ సాన్యో.. 32, 43 ఇంచుల డిస్‌ప్లే సైజుల్లో రెండు నూతన ఫుల్‌హెచ్‌డీ రిజల్యూషన్ ఉన్న స్మార్ట్‌టీవీలను భారత మార్కెట్‌లో తాజాగా విడుదల చేసింది. వీటిల్లో యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్, ఆండ్రాయిడ్ మిర్రరింగ్ తదితర ఫీచర్లను కామన్‌గా అందిస్తున్నారు. అలాగే 896 మెగాహెడ్జ్ సీపీయూ, 768 ఎంబీ ర్యామ్, 4 జీబీ స్టోరేజ్, వైఫై, హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఆర్‌జే-45, హెడ్‌ఫోన్ అవుట్‌పుట్ పోర్టులు తదితర ఫీచర్లను ఈ టీవీల్లో అందిస్తున్నారు. ఇక 32 ఇంచుల టీవీ ధర రూ.12,999 ఉండగా, 43 ఇంచుల టీవీ ధర రూ.22,999గా ఉంది. వీటిని వినియోగదారులు అమెజాన్‌లో కొనుగోలు చేయవచ్చు.