సరి కొత్త ఆలోచనలతో వినాయక చవితి ఉత్సవాలు

వినాయక చవితి అనగానే మనకు గుర్తుకు వచ్చేది పెద్ద పెద్ద సెట్టింగ్స్ , మండపాల నిర్మాణం, చందాల సేకరణ। ఇవి అన్ని పోటీ పడి చేస్తుంటారు, అయినాగానీ అందరు కలిసి వేడుకలు నిర్వహించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేని పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాము। పండగ పూట ఇంట్లో పిండివంటలు చేసుకొని నాలుగు సెల్ఫీ ఫోటో దిగి మా ఇంట్లో పండగ ఘనంగా చేసుకున్నాము అని ప్రచారం చేసుకుంటారు। అయితే మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండలం ధరిపల్లి గ్రామా యూవత సరికొత్త పంథాలో ముందుకు వెళ్తుంది। గ్రామం లోని ప్రతి ఒక్కరికి ఉత్సావాల్లో భాగం చేయడానికి సరి కొత్త ఆలోచనతో గ్రామానికి చెందిన యూవత ఆహ్వాన పత్రికలు సిద్ధం చేసి పండగ ప్రాముఖ్యతను చెపుతూ ఆహ్వానమిచ్చారు। ఈ ఆహ్వానాన్ని గ్రామం నుండి వెళ్లి ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికీ కూడా యూవజన సంఘము సభ్యులు వెళ్లి ఆహ్వానించారు। దీనితో చాలా రోజులుగా ఊరికి రాలేని వారు కూడా ఈ సారి శోభాయాత్ర లో పాల్గొంటానడానికి ఇష్టపడుతున్నారు। అంతే కాకుండా తమ వంతు సాయాన్ని కూడా వారు అందించారు।

అలాగే సహజ సిద్దంగా మండపాన్ని నిర్మించి ఆకట్టుకున్నారు। ప్రతి సంవత్సరం లాగా కాకుండా ఈ సారి మంచి ఆలోచనతో మండప నిర్మాణం చేసారు గ్రామానికి చెందిన వారు కొనియాడారు। ఈ యేడు శోభ యాత్ర కూడా వినూత్న పద్ధతిలో నిర్వహిస్తామని విశ్వ విజేత యూవజన సంఘము సభ్యులు తెలిపారు।