షియోమీ ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ బల్బ్ రూ.1299

చైనాకు చెందిన మొబైల్స్ తయారీదారు షియోమీ తన ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్ బల్బ్‌ను గత ఏప్రిల్ నెలలో భారత్‌లో లాంచ్ చేసిన విషయం విదితమే. కాగా ఈ బల్బ్‌ను ఇవాళ్టి నుంచి భారత్‌లో విక్రయిస్తున్నారు. ఇది 10 వాట్ల సామర్థ్యం 800 ల్యూమెన్స్ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. అమెజాన్ అలెక్సా, గూగుల్ అసిస్టెంట్‌లకు ఇందులో సపోర్ట్‌ను అందిస్తున్నారు. కాగా ఈ లైట్‌ను యాప్ సహాయంతో ఆపరేట్ చేసుకోవచ్చు. అందుకు గాను వైఫై ఉండాలి. ఈ బల్బు ద్వారా 16 మిలియన్ల రంగుల కాంతిని వెలువరించవచ్చు. ఈ బల్బును నిత్యం 6 గంటల పాటు వాడితే 11 సంవత్సరాల వరకు పనిచేస్తుంది. కాగా ఎంఐ ఎల్‌ఈడీ స్మార్ట్‌బల్బ్‌ను రూ.1299 ధరకు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, ఎంఐ ఆన్‌లైన్ స్టోర్‌లలో వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.