శ్రావణంలోనూ ఆషాఢం ఆఫర్లు

సౌత్ ఇండియా షాపింగ్ మాల్ తమ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. శ్రావణ మాసంలోనూ ఆషాఢం ఆఫర్లను కొనసాగిస్తున్నట్లు గురువారం స్పష్టం చేసింది. దీంతో గడిచిన నెల రోజుల తరహాలోనే ఈ నెల కూడా తగ్గింపు ధరలకు, కిలోల్లో నచ్చిన వస్ర్తాలను పొందవచ్చని ఓ ప్రకటనలో సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వెల్లడించింది. ఆషాఢ మాసంలో అన్ని రకాల వస్ర్తాలపై 66 శాతం వరకు ఇచ్చిన తగ్గింపు చీరల అమ్మకాల్ని విపరీతంగా పెంచిందని, కిలో పట్టు చీరలను రూ.1,800లకు, ఫ్యాన్సీ చీరలను రూ. 1,100లకు విక్రయించామని తెలిపింది. కంచి, ధర్మవరం, ఆరణి, ఉప్పాడ, బెనారస్, చంధేరి, భగల్ పూరి, పోచంపల్లి, పైతాని, కళంకారీ, పఠోళ రకం చీరలకు పెద్ద ఎత్తున డిమాండ్ కనిపించినట్లు వివరించింది. ఈ క్రమంలోనే కస్టమర్ల కోసం ఆషాఢం ఆఫర్లను ఈ శ్రావణ మాసంలోనూ పొడిగించాలని నిర్ణయించినట్లు సంస్థ యాజమాన్యం వెల్లడించింది. రూ.995 విలువ కలిగిన కశ్మీర్ చీరలపై, రూ.1,995 విలువైన ఆరాధన ప్రింటెడ్ చీరలపై 50 శాతం, రూ.450 విలువ గల లిబాస్ ప్రింట్ చీరలపై 40 శాతం తగ్గింపునిచ్చామని, రూ.350లకే 2 డ్రెస్ మెటీరియల్స్‌తోపాటు మెన్స్‌వేర్ సూటింగ్, షర్టింగ్‌ల్లో ప్రముఖ బ్రాండ్లపై 50 శాతం తగ్గింపు ఇచ్చామని సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వర్గాలు వెల్లడించాయి. ఈ ఆఫర్లు ఈ నెలలోనూ అందుబాటులో ఉంటాయని తెలిపింది.