శాంసంగ్ గెలాక్సీ ఫిట్ ఇ స్మార్ట్‌బ్యాండ్ రూ.2590

ఎలక్ట్రానిక్స్ తయారీదారు శాంసంగ్ తన నూతన స్మార్ట్‌బ్యాండ్ గెలాక్సీ ఫిట్ ఇ ని ఇవాళ భారత మార్కెట్‌లో విడుదల చేసింది. రూ.2590 ధరకు ఈ స్మార్ట్‌బ్యాండ్ వినియోగదారులకు లభిస్తున్నది. ఇందులో 0.74 ఇంచుల డిస్‌ప్లే, 128 కేబీ ర్యామ్, 4ఎంబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్, ఐఓఎస్ కనెక్టివిటీ, యాక్టివిటీ ట్రాకర్, స్లీప్ ట్రాకర్, హార్ట్ రేట్ మానిటర్, వాటర్ రెసిస్టెన్స్, బ్లూటూత్ ఎల్‌ఈ, 70 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.