విస్తరణ దిశగా మ్యాజిక్‌పిన్‌

ఆఫ్‌లైన్‌ డిస్కవరి ప్లాట్‌ఫామ్‌ మ్యాజిక్‌ పిన్‌ను అంతర్జాతీయంగా విస్తరించే యోచనలో ఉన్నామని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అంశూ శర్మ తెలిపారు. బుధవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం ఢిల్లీ, నోయిడా, గుర్‌గావ్‌, బెంగళూరు, ముంబయి, పూణె, హైదరాబాద్‌, చెన్నరు, అహ్మాదాబాద్‌ తదితర కీలక నగరాల్లో సేవలందిస్తున్నామన్నారు. తమ యాప్‌ లోకేషన్‌ ఇంటిలిజెన్స్‌ను ఉపయోగించడం ద్వారా వినియోగదారులు తమ చుట్టు పక్కల్లోని ఆసక్తిదాయక ఉత్పాదనల కొనుగోలుకు దోహదం చేస్తుందన్నారు. కిరణా సరుకుల నుంచి దుస్తుల కొనుగోలు వరకు ఇబ్బందిరహితం చేస్తుందన్నారు.