True Journalism, No misleading titles, No cooked up stories and cheap analyses?….. 

Contact Us : [email protected], Call : 9849851841 

విశాఖ గ్యాస్‌ బాధితులకు ఆరోగ్యశ్రీ అండ

విశాఖపట్నంలో ఎల్‌జీ పాలిమర్‌ గ్యాస్‌ లీకేజ్‌ ఘటనలో బాధితులకు గుర్తింపు పొందిన ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స అందజేస్తే వైద్య ఖర్చులను పూర్తిగా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ చెల్లిస్తుందని ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. విశాఖతో పాటు  గ్యాస్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న గుర్తింపు పొందిన ఏ ప్రైవేటు ఆస్పత్రిలోనైనా బాధితులు ఎటువంటి ఫీజు చెల్లించకుండానే వైద్య సేవలను పొందవచ్చు. ఆరోగ్య శ్రీతో అనుసంధానం అయిన ఆస్పత్రితో పాటు, అనుసంధానం కాని ఆస్పత్రులకు కూడా ఇది వర్తిస్తుందని ప్రకటించింది. సహాయం కోసం ఆరోగ్య శ్రీ విశాఖ హెల్ప్‌లైన్‌ నంబర్‌ 83338 14019కు సంప్రదించగలరని తెలిపింది.