వాజ్ పేయి పుట్టింది 1926 కాదు 1924లో నట….

అటల్ బిహారి వాజ్‌పేయి పుట్టిన తేదీ డిసెంబర్ 25, 1924. ఇది ఇంట్లో వాళ్ల ప్రకారం. బ్రహ్మజుర్తుర్‌లోని షిండే ఇంట్లో ఆయన పుట్టారు. అయితే వాజ్‌పేయి స్కూల్ సర్టిఫికెట్‌లో మాత్రం పుట్టిన రోజు తేదీ మరోలా ఉంది. స్కూల్ సర్టిఫికెట్ ప్రకారం ఆయన డిసెంబర్ 25, 1926లో పుట్టారు. వాజ్‌పేయి తండ్రే.. రెండేళ్ల తేడాతో స్కూల్ సర్టిఫికెట్‌లో పుట్టిన తేదీ వివరాలు రాయించారట. వయసు తక్కువ రాస్తే, పిల్లోడు ఎక్కువ కాలం పనిచేసే వీలు ఉంటుందని తండ్రి అలా రాయించాడట