వాజ్‌పేయి .జీవితంలో .ముఖ్య ఘట్టాలు

వాజపేయి డిసెంబర్ 25, 1924లో గ్వాలియర్‌లో జన్మించారు. -1942 ఆగస్టులో క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో వాజపేయి తన్న అన్న ప్రేమ్‌తో కలిసి 23 రోజుల పాటు అరెస్టు -1975-77 మధ్య కాలంలో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ కాలంలో అనేక మంది విపక్ష నాయకులతో పాటు వాజపేయీ అరెస్టు అయ్యారు. -1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ గెలిచింది. మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో వాజపేయి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పని చేశారు. -1980లో భారతీయ జనతా పార్టీని నెలకొల్పడం. 1980 నుంచి 86 వరకు బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా వాజపేయి పని చేశారు. -1996 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో వాజపేయి భారత 10వ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు. కానీ బీజేపీ ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకోవడంలో విఫలమవడంతో.. తన బలాన్ని నిరూపించుకోలేకపోయింది. దీంతో 13 రోజుల అనంతరం ప్రధాని పదవికి వాజపేయి రాజీనామా చేశారు. -1998లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అన్ని పార్టీల కంటే అత్యధిక స్థానాల్లో విజయం సాధించింది. ఈ సమయంలో భావసారూప్యత కలిగిన పార్టీలన్నీ బీజేపీతో కలిసి నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌గా ఏర్పడ్డాయి. దీంతో వాజపేయి రెండోసారి ప్రధానిగా ఎన్నిక అయ్యారు. ఎన్డీఏ తన మెజార్టీని లోక్‌సభలో నిరూపించుకుంది. ఈ ప్రభుత్వం 13 నెలల పాటు కొనసాగింది. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన జయలలిత నాయకత్వంలోని అన్నా డీఎంకే పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో వాజపేయి ప్రభుత్వం మెజార్టీని కొల్పోయింది. 1999 ఏప్రిల్ 17న జరిగిన విశ్వాస పరీక్షలో ఒక్క ఓటుతో ప్రభుత్వం ఓడిపోయింది. -1999 సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్‌డీఏ కూటమి 303 లోక్‌సభ స్థానాలను గెలిచి.. పార్లమెంట్‌లో స్థిరమైన మెజార్టీని పొందింది. వాజపేయి 1999 అక్టోబర్ 13న మూడోసారి ప్రధానమంత్రి పీఠాన్ని అధిష్టించారు. 1999-2004 మధ్యకాలంలో ప్రధానిగా ఐదు సంవత్సరాలు పదవీకాలం పూర్తి చేసిన తొలి కాంగ్రెసేతర వ్యక్తిగా వాజపేయి గుర్తింపు పొందారు. వరించిన అవార్డులు..
-1992లో పద్మ విభూషణ్ -1993లో కాన్పూర్ యూనివర్సిటీ నుంచి డీలిట్ గౌరవ పురస్కారం -1994లో లోకమాన్య తిలక్ పురస్కారం -1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు -1994లో భారతరత్న గోవింద్ వల్లభ్‌పంత్ అవార్డు -2014లో భారతరత్న వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే పోక్రాన్‌లో పరమాణు పరీక్షను నిర్వహించారు. 1998 మే నెలలో ఆ పరీక్ష చేపట్టారు. దీంతో భారత్ అణుశక్తి దేశంగా ఆవిర్భవించింది. 1999లో దయాది దేశం పాకిస్థాన్‌పై కార్గిల్ యుద్ధం జరిగింది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్న సమయంలోనే ఆ యుద్ధం జరిగింది. పాక్‌తో జరిగిన ఆ యుద్ధంలో భారత్ గెలిచింది.