సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక పథకం
ప్రభుత్వ రంగ అతిపెద్ద బ్యాంకు ఎస్బీఐ కీలక వడ్డీ రేట్లను సవరించింది. నిధులపై వ్యయానికి అనుగుణంగా రుణాలపై వడ్డీ రేటు (ఎంసీఎల్ఆర్)ను 15 బేసిస్ పాయింట్లు మేర కోత పెట్టింది. ప్రస్తుతం 7.40 శాతంగా ఉన్న రేటును 7.25 శాతానికి తగ్గించింది. దీంతో ఎంసీఎల్ఆర్తో అనుసంధానం కలిగిన రుణాలను తీసుకున్నవారికి లబ్ధి చేకూరనుంది. ఉదాహరణకు 30 ఏళ్ల వ్యవధిపై రూ.25 లక్షలు గృహ రుణం తీసుకున్న వారికి ఈఎంఐ సుమారు రూ.255 తగ్గనుంది. మే 10 నుంచి ఈ రేట్లు అమల్లోకి రానున్నాయి. అలాగే, మూడేళ్ల కాలవ్యవధి కలిగిన రిటైల్ టర్మ్ డిపాజిట్లపై 20 బేసిస్ పాయింట్ల మేర కోత విధించింది. మే 12 నుంచి ఈ వడ్డీరేట్లు వర్తిస్తాయి.