అన్ని రకాల పొదుపు ఖాతాల వడ్డీరేటుపై 0.25శాతం మేర కోత విధిస్తున్నామని దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ ప్రకటించింది. ఇకపై అన్ని డిపాజిట్లపై 2.75 శాతం మాత్రమే వడ్డీ చెల్లించనుంది. కొత్త వడ్డీ రేట్లు 2020, ఏప్రిల్ 15 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. ఇంతకు ముందు వరకు ఈ వడ్డీరేటు 3 శాతంగా ఉండేది.
అన్ని రకాల రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటుపై 35 బేసిస్ పాయింట్ల మేర కోత విధిస్తున్నామని ఎస్బీఐ తెలిపింది. 7.75 శాతంగా ఉన్న వడ్డీరేటు 2020, ఏప్రిల్ 10 నుంచి 7.40శాతంగా ఉండనుంది. 2019-20లో వరుసగా 11వ సారి ఎంసీఎల్ఆర్ రేటులో కోత విధిస్తున్నామని బ్యాంకు ప్రకటించింది. 30 ఏళ్ల కాల పరిమితి గృహ రుణాల ఈఎంఐలు (ఎంసీఎల్ఆర్కు అనుసంధానమైన) లక్షకు రూ.24 రూపాయాలు తగ్గుతాయని వెల్లడించింది.
