లెనొవొ ఏఐ ఆధారిత అల్ట్రా స్లిమ్‌ పీసీ ‘యోగా ఎస్‌940’

ధరల శ్రేణి రూ.23,990–1,69,990

చైనాకు చెందిన ప్రముఖ పర్సనల్‌ కంప్యూటర్‌ (పీసీ) తయారీ కంపెనీ ‘లెనొవొ’ తాజాగా పలు అధునాతన ఉత్పత్తులను ఆవిష్కరించింది. ఐడియాప్యాడ్‌ టాబ్లెట్లు, యోగా ఆల్‌ ఇన్‌ వన్‌ డెస్క్‌టాప్‌లు, అల్ట్రా–స్లిమ్‌ నోట్‌బుక్‌లను బుధవారం విడుదలచేసింది. ‘యోగా ఎస్‌940’ పేరిట కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత అల్ట్రా స్లిమ్‌ పీసీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వీటి ధరల శ్రేణి రూ.23,990– 1,69,990 వరకు ఉన్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా లెనొవొ ఇండియా ఎండీ, సీఈఓ రాహుల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది పీసీ మార్కెట్లో 30–40% వృద్ధి ఉండొచ్చు. ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ తమిళనాడు లిమిటెడ్‌ నుంచి ఈ త్రైమాసికంలో ఆర్డర్‌ లభిస్తుందని భావిస్తున్నాం’ అని చెప్పారు.