రైల్వే ప్రయాణికులకు ద.మ. రైల్వే విజ్ఞప్తి

దాదాపు రెండు నెలల తర్వాత జూన్‌ 1 నుంచి ప్రత్యేక రైళ్ల సేవలు ప్రారంభమైన నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు ఓ విజ్ఞప్తి చేసింది. జంట నగరాలైన సికింద్రాబాద్‌తో పాటు హైదరాబాద్‌ (నాంపల్లి) స్టేషన్‌లోనూ రైలు సేవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. ఈ రెండు స్టేషన్లనూ తమ ప్రయాణాలకు వినియోగించుకోవచ్చని సూచించింది. ఈ రెండు స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్థం అదనపు థర్మల్‌ స్క్రీనింగ్‌ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.