రెవెన్యూ శాఖలో 316 పోస్టుల భర్తీకి అనుమతి

హైదరాబాద్ : రెవెన్యూ శాఖలో కొత్తగా 316 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 152 గిర్దావర్, 56 ఆఫీస్ సబార్డినేట్, 26 తహశీల్దార్, 23 జూనియర్ అసిస్టెంట్, రెండు డిప్యూటీ కలెక్టర్ సహా వివిధ పోస్టుల భర్తీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.