రెడ్ జోన్ పరిధిలోకి సూర్యపేట

సూర్యపేట పట్టణాన్ని పూర్తిగా రెడ్ జోన్ పరిధిలో కీ వస్తుందని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రకటించారు. అదే సమయంలో కరోనా వైరస్ గ్రామీణ ప్రాంతాల్లోకి వ్యాప్తిచెందకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. ప్రజలు ఎటువంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

లాక్ డౌన్ కు ముందే పరీక్షలకు పోయిన శాంపిల్స్ ఒక్కొక్కటిగా ఫలితాలు వెళ్లాడవుతున్న నేపద్యంలోనే గందరగోళం నెల కొందని అంతకు మించి ఏమి ఉండదని అంతా మంచే జరుగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. చైన్ లింక్ తోటే వైరస్ వ్యాపించిందన్న సమాచారం అందుతుందని.. ఆ లింక్ ను తెంపేందుకే లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టం గా అమలు పరచాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు.

సూర్యపేట జిల్లా కేంద్రంలో కరోనా వైరస్ పాజిటివ్  కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న నేపద్యంలో రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి స్థానిక శాసనసభ్యులు స్వయంగా రంగంలోకి దిగారు. ఒకే ఇంట్లో పెద్ద మొత్తంలో కరోనా సోకి పాజిటివ్ తో క్యారంటైన్ కు చేరుకున్నారన్న సమాచారం తో గురువారం రాత్రి సూర్యపేట కు చేరుకున్న ఆయన అందుబాటులో ఉన్న అధికారులతో పరిస్థితులు సమీక్షించారు. శుక్రవారం ఉదయం నుండి సూర్యపేట లో మకాం వేసిన మంత్రి జగదీష్ రెడ్డి ప్రజల్లో నెలకొని ఉన్న భయాందోళనలకు పులిస్టాఫ్ పెట్టేవిదంగా చర్యలకు ఉపక్రమించారు.
అందులో బాగంగా ఈ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో సూర్యపేట పురపాలక సంఘం కార్యాలయ భవన్ లో జిల్లా అధికార యంత్రాంగం తో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు.

రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మున్సిపల్ చైర్ పర్సన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ జిల్లా కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, జిల్లా వైద్యఅధికారుల బృందం ఆర్ డి ఓ మోహన్ రావు ,మున్సిపల్ కమిషనర్ రామంజుల్ రెడ్డి తదితరులు పాల్గొన్న సమీక్ష లో పలు అంశాల పై సుదీర్ఘంగా చర్చించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *