పోర్ట్రోనిక్స్ కంపెనీ పికో పేరిట ఓ నూతన పోర్టబుల్ వైర్లెస్ స్పీకర్‌ను ఇవాళ భారత మార్కెట్లో విడుదల చేసింది. దీని బరువు కేవలం 50 గ్రాములు మాత్రమే ఉంటుంది. అందువల్ల చాలా తేలిగ్గా ఈ స్పీకర్‌ను ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు. ఇందులో 3 వాట్ల స్పీకర్‌ను ఏర్పాటు చేశారు. ఈ స్పీకర్లో 300ఎంఏహెచ్ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. అందువల్ల దీన్ని కేవలం 1 గంటలోనే ఫుల్ చార్జింగ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ 4.2 ద్వారా ఈ స్పీకర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్ డివైస్‌లకు కనెక్ట్ అవుతుంది. ఇక ఈ స్పీకర్‌ను రూ.999 ధరకు వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు.
