రూ.8,000-15,000 శ్రేణిలో ఎల్‌జీ డబ్ల్యు స్మార్ట్‌ ఫోన్లు

అమెజాన్‌లో జులై నుంచి విక్రయాలు

కొరియా సంస్థ అయిన ఎల్‌జీ కొత్తగా డబ్ల్యు శ్రేణి స్మార్ట్‌ఫోన్లను ఆవిష్కరించింది. వీటిని రూ.8,000-15,000 శ్రేణిలో లభించే 5 రకాల ఫోన్లను దేశీయంగా తయారు చేస్తున్నామని, ఆన్‌లైన్‌ పోర్టల్‌ అమెజాన్‌ డాట్‌ ఇన్‌లోనే విక్రయిస్తామని ప్రకటించింది. డిసెంబరులోపు 10 లక్షల ఫోన్లు విక్రయించాలనేది సంస్థ లక్ష్యమని ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా బిజినెస్ హెడ్ (మొబైల్‌) అద్వైత్‌ వైద్య తెలిపారు. భారత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఫోన్లను తొలిసారిగా ఇక్కడే ఆవిష్కరించినట్లు వెల్లడించారు. వీటిలో 2 ఫోన్లు జులై నుంచి, ఒక ఫోన్‌ ఆగస్టు నుంచి, మరో 2 మోడళ్ల విక్రయాలు దీవాలీ సమయంలో ప్రారంభిస్తామని వివరించారు. యువతను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన డబ్ల్యు30, డబ్ల్యు 30 ప్రో స్మార్ట్‌ఫోన్లలో 3 కెమేరాలుంటాయని, అందుబాటు ధర ఆకర్షణీయమని తెలిపారు.